Viral – Ireland Fan Wrote a Letter To Pawan: పవన్‌కు లెటర్ రాసిన ఐర్లాండ్ ఓడ కళాసి- కన్నీళ్లు పెట్టుకున్న జనసేనాని

Ireland Fan Letter To Pawan: జనసేన(Janasena) అధినేత పవన్కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత పార్టీ విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమాను అంచనాలు పెట్టుకున్నారు.
పార్టీని వారు ఆదరించడమే కాదు.. ఎనలేని అభిమానం సైతం పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తపిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో జనసేన అభిమానులు స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పార్టీ నిలదొక్కుకోవాలని.. పవన్ కళ్యాణ్పుంజుకోవాలని ఆశిస్తున్నారు.


తాజాగా ఐర్లాండ్(Irland)లో గత 17 ఏళ్లుగా ఉంటున్న ఓ అభిమాని.. స్వయంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు లేఖ రాశారు. పార్టీని బలోపేతం చేయాలని.. 2014లో ఏర్పాటు చేసుకున్న పార్టీ 2019లో బలోపేతం అయిందని.. 2024లో బలంగా కలబడాలని ఆ అభిమాని పిలుపునిచ్చారు. తనను తాను.. `ఓడ కళాసీ`గా పరిచయం చేసుకున్న అభిమాని తన స్వదస్తూరి(Hand writing)తో ఈ లేఖను రాసి పవన్ కళ్యాణ్కు పంపించారు. యుద్ధ
సన్నద్ధతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆ అభిమాని పేర్కొన్నారు.

లేఖ సారాంశం ఇదీ..

అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు… కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో(Baliviya Forest) అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?

సరికొత్త గెరిల్లా వార్ ఫైర్(Gerilla war Fire)ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చక పోతావా?

17 ఏళ్లుగా ఈ దేశం(Country)లో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని(Citizenship) వదులుకోలేక.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.

2014 – నిలబడ్డాం
2019 – బలపడ్డాం
2024 -బలంగా కలబడదాం!

కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతున్నా… కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి(Power full) అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్(Power Star)వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. – ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.

పవన్ ట్వీట్ ఇదీ!
“ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పని చేస్తున్న నా జనసేన అభిమానీ నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు) తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు. – అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే.. ఇంత అభిమానాన్ని.. ఇంత మంది అభిమానులను సంపాయించుకున్న పవన్ కళ్యాణ్కు మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. కేవలం తన కళ్ల ముందు కనిపించే అభిమానులే కాకుండా.. తెరచాటున కూడా తనను అనుసరిస్తున్నవారు, గమనిస్తున్నవారు చాలా మందే ఉన్నారనేది `ఓడ కళాసీ` రూపంలో నిజమైందనే చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానుల ఆశలను, వారి నమ్మకాన్ని మరింత ద్రుఢంగా నిలబెట్టుకునేందుకు ఎలా ముందుకు సాగుతారో చూడాలి. ఏదేమైనా.. పవన్కు మరింత బాధ్యత పెరిగిందని, ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.