విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే తిమ్మిర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. తిమ్మిరి ఎక్కడం, సూదులతో పొడిచినట్లుగా అనిపించడం లాంటివి జరుగుతాయి. విటమిన్ బి12 లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
ఏకాగ్రత కోల్పోతారు. డిమెన్షియాకు కూడా దారి తీస్తుంది. విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే హార్ట్ బీట్ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది ఆక్సిజన్ రవాణా తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది..
విటమిన్ బి12 లోపం ఉంటే ముఖం పాలిపోతుంది. పచ్చకామెర్లు వచ్చినట్లుగా చర్మం మారిపోతుంది. అలాంటప్పుడు కూడా ఒకసారి డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవడం ఉత్తమం..విటమిన్ బి12 ఒంట్లో తక్కువగా ఉన్నట్లయితే నీరసం, బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎనర్జీ కూడా తగ్గిపోతుంది.
విటమిన్ బి12 లోపం ఉంటే మూడ్ స్వింగ్స్, చికాకుతో పాటుగా డిప్రెషన్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నోటిలో అల్సర్లు రావడం కూడా విటమిన్ బి12 లోపానికి కారణం. అలాంటప్పుడు కూడా డాక్టర్‌ను కలిసి మెడికేషన్ తీసుకోవడం మంచిది.
విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే నడవడానికి ఇబ్బందిగా ఉండడం, పదేపదే పడిపోవడం, సరిగ్గా బాడీ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. శాకాహారులకి, వృద్ధులకి విటమిన్ బి12 లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని, అవసరమైన మెడిటేషన్ చేస్తే సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.
అరికాళ్లు, చేతుల్లో మండుతున్నట్లు అనిపిస్తే అది విటమిన్ B12 లోపానికి సూచిక కావచ్చనని నిపుణులు చెబుతున్నారు. బి12 లోపంతో నరాల పనితీరు కూడా బలహీనపడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా అలసటగా ఉండటం, బలహీనత, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, కళ్లు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండెదడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవటం లాంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
































