జ్వరం, విరేచనాలప్పుడు ORS సరిపోతుందా?.. మందులు కూడా అవసరమా?

జ్వరం, వాంతులు లేదా విరేచనాల సమయంలో చాలామందికి తొలుత గుర్తొచ్చేంది ORS (Oral Rehydration Solution) . శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలు తిరిగి అందించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా వైద్యులు సూచిస్తున్నారు.


అయితే కేవలం ORS సరిపోతుందా, లేక మందులు కూడా తీసుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది.

ORS ఎందుకు అవసరం?
వాంతులు, విరేచనాలు ఎక్కువగా జరిగినప్పుడు శరీరం నుంచి నీటితో పాటు ముఖ్యమైన లవణాలు, ఖనిజాలు కూడా బయటకు వెళ్తాయి. దీని వల్ల బలహీనత, తల తిరగడం, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ORSలో ఉన్న ఉప్పు, చక్కెర, ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తినిచ్చి నీరు నిల్వచేయడంలో సహాయపడతాయి.

సాధారణ పరిస్థితుల్లో : తేలికపాటి విరేచనాలు లేదా వాంతులు ఉన్నప్పుడు ORS చాలుతుంది. మందులు లేకుండానే శరీరం కోలుకుంటుంది.
తీవ్రమైన పరిస్థితుల్లో : విరేచనాలు ఆగకపోతే, కడుపు నొప్పి పెరిగితే లేదా రక్తంతో కూడిన విరేచనాలు వస్తే ORS మాత్రమే సరిపోదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలి.

ORS తో పాటు వాడే మందులు

యాంటీబయాటిక్స్ : బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు సూచిస్తారు.
ప్రోబయోటిక్స్ : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వాంతులు, జ్వరం కోసం ఇతర మందులు కూడా వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.