Wooden Comb: జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్‌ దువ్వెన మంచిదా? చెక్క దువ్వెన మంచిదా?

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు..
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు.


చాలా మంది జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్ దువ్వెనలు ఉపయోగిస్తుంటారు. అలాగే దువ్వెన మురికిగా ఉంటే, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ సమయం లేకపోవడం వల్ల హడావిడిగా అదే దువ్వెనతో దువ్వుతూ ఉంటారు.

ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును దువ్వడం వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు సరైన రక్త ప్రసరణ జరగదు. దీనివల్ల జుట్టు సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి జుట్టు సంరక్షణ కోసం చెక్క దువ్వెనను ఎంచుకోవడం మంచిది.

చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా, ఆక్సిజన్ తగినంత మొత్తంలో జుట్టు మూలాలకు చేరుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా స్కాల్ప్ నుంచి సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఆ సెబమ్ మిగిలిన వెంట్రుకలకు చేరకపోతే, అది తలపై పేరుకుపోయి, తలలో జిడ్డుగా మారుతుంది. తల చర్మం జిడ్డుగా మారినప్పుడు చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల ఈ సెబమ్ స్కాల్ప్‌తో పాటు మిగిలిన జుట్టుకు వ్యాపిస్తుంది.

చుండ్రు, తలపై మృతకణాలు పేరుకుపోవడం అనే సమస్యలు ప్లాస్టిక్ దువ్వెన వల్ల పెరుగుతాయి. కానీ చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను సులభంగా నివారించవచ్చు. ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును విడదీయడం కష్టం. కానీ చెక్క దువ్వెనతో జుట్టును దువ్వడం సులువుగా ఉంటుంది. అలాగే చెక్క దువ్వెనలతో జుట్టు చిక్కుతీయడం కూడా చాలా సులభం.