యువతలో ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా?… అనుమానాలకు చెక్ పెట్టిన ఢీల్లీ ఎయిమ్స్ స్టడీ, తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

రోనా మహమ్మారి తర్వాత రోజులలో యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం కూడా కారణం కావొచ్చనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.


అయితే అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కూడా తాజా అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒక ఏడాది పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఈ అధ్యయనాన్ని జరిపింది. ”బర్డెన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్: ఎ వన్-ఇయర్ అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఎ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా” అనే శీర్షికతో కూడిన ఈ అధ్యయనం… ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన జర్నల్ ”ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌”లో పబ్లిష్ అయింది.

ఈ అధ్యయనంలో… వెర్బల్ ఆటోప్సీ, పోస్ట్‌మార్టం ఇమేజింగ్, సంప్రదాయ ఆటోప్సీ, వివరణాత్మక హిస్టోపాథలాజికల్ పరీక్షలను ఉపయోగించి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల ఆకస్మిక మరణ కేసులను పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో కోవిడ్-19 టీకాకు, యువకులలో ఆకస్మిక మరణాలకు మధ్య సంబంధాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ కనుగొనబడలేదు.

ఇటువంటి మరణాలకు అంతర్లీనంగా ఉన్న హృదయ సంబంధిత, ఇతర వైద్య కారణాలే కారణమని ఈ అధ్యయనం స్పష్టంగా చూపింది. ఎల్లప్పుడూ ఆధారాల-ఆధారిత పరిశోధనల ద్వారానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఎయిమ్స్- ఢిల్లీకి చెందిన డా. సుధీర్ అరవ తెలిపారు.

ఇక, హృదయ ధమనుల వ్యాధి (Coronary Artery Disease – CAD) యువకులలో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం… 2,214 ఆటోప్సీలలో, 180 కేసులు (8.1%) ఆకస్మిక మరణాల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ ఆకస్మిక మరణాల చోటుచేసుకుంటుంది 57.2 శాతంమంది యువకులలోనే (45 సంవత్సరాలలోపు) ఉన్నారు. ఇది 46-65 సంవత్సరాల వయస్సు వారిలో సంభవించిన 42.8 శాతం మరణాల కంటే ఎక్కువగా ఉంది. యువకుల్లో ఆకస్మిక మరణాల సగటు వయస్సు 33.6 సంవత్సరాలుగా ఉంది.ఇంకా… మరణించిన యువతలో పురుషులు అధికంగా ఉన్నారు. పురుషులు-మహిళల నిష్పత్తి 4.5:1గా నమోదైంది.

యువకులలో ఆకస్మిక మరణాలలో దాదాపు మూడింట రెండు వంతుల మరణాలకు గుండె సంబంధిత కారణాలే కారణమని పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో కరోనరీ ఆర్టరీ వ్యాధి అత్యంత సాధారణ అంతర్లీన వ్యాధిగా వెలుగులోకి వచ్చిందని ఈ అధ్యయనం తెలిపింది. ఇతర ఆరోగ్య సమస్యల కారణాలు దాదాపు మూడింట ఒక వంతు కేసులకు దోహదపడ్డాయని పేర్కొంది. వృద్ధులలో కనిపించే దానితో పోలిస్తే యువకులలో ఆకస్మిక మరణాల సరళి గణనీయంగా భిన్నంగా ఉందని తెలిపపింది. ఇందులో అరిథ్మోజెనిక్ రుగ్మతలు, కార్డియోమయోపతీలు, పుట్టుకతో వచ్చే లోపాలు కీలకంగా పెద్ద పాత్ర పోషిస్తున్నాయని కూడా పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.