రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందా? 7 రోజుల్లో ఇలా కంట్రోల్

మధుమేహం ఉన్నవారు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రమైన గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాల సమస్యలకు దారితీస్తుంది.


కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. కేవలం మందులతో షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా.. డైట్​లో తీసుకునే కొన్ని ఫుడ్స్​తో కూడా డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. ఏడు రోజుల్లో రక్తంలోని షుగర్​ని కంట్రోల్ చేసే ఫుడ్స్ ఏంటి? వాటివల్ల రక్తంలోని చక్కెర ఎలా అదుపులో ఉంటుందో తెలుసుకుందాం.

బెండకాయ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ ఒక వరం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత చక్కెర నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. అకస్మాత్తుగా చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో బెండకాయ కూర లేదా తేలికగా ఉడికించిన బెండకాయలను తీసుకోవచ్చు.

అవకాడో

అవకాడోలు కొంచెం ఖరీదైనవి. కానీ వాటి ప్రయోజనాలు వెలకట్టలేనివి. వీటిలో మంచి మొత్తంలో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కలిసి జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతాయి. అవకాడోలు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండి ఉంటుంది. ఇది తరచుగా వేసే ఆకలిని నివారించడంలో సహాయపడుతుంది. అతిగా తినడం నిరోధిస్తుంది. అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అద్భుతమైన పండుగా చెప్తారు.

మష్రూమ్స్

పుట్టగొడుగులలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు డయాబెటిస్తో సంబంధం ఉన్న ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి. అవి శరీరంలో మంటను కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

టోఫు

శాఖాహారులకు టోఫు ఒక అద్భుతమైన ప్రోటీన్ సోర్స్. ఈ టోఫు కండరాలను బలపరుస్తుంది. కండరాలు బలంగా ఉన్నప్పుడు శరీరం గ్లూకోజ్ను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా నిర్వహించడానికి, ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ​

గ్రీన్ టీలోని కాటెచిన్లు శరీరంలోని గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి కొవ్వును కాల్చడానికి కూడా సహాయపడతాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ నిర్వహణను సులభతరం చేస్తుంది. రోజూ 1–2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్లో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. తగ్గిన మంట ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. తక్కువ కేలరీలు, తక్కువ కార్బ్ కంటెంట్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బార్లీ

బార్లీ అనేది ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యం. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బార్లీ తీసుకోవడం వల్ల ఆకస్మిక చక్కెర హెచ్చుతగ్గులను నివారించవచ్చు. ఎక్కువ కాలం శక్తిని నిలుపుకోవచ్చు. మీరు బార్లీ బ్రెడ్ తినడానికి లేదా బార్లీ నీరు తాగేందుకు ట్రై చేయండి.

ఈ ఫుడ్స్ మీరు రెగ్యులర్​గా తీసుకుంటే రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే వైద్యులు సూచించే మందులు, వ్యాయామాలు ఫాలో అయితే షుగర్ సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.