సిబిల్ స్కోర్ తక్కువుందా.. ఇలా చేస్తే వెంటనే 100 పాయింట్లు పెరగడం పక్కా

లోన్స్, క్రెడిట్ కార్డులు కావాలంటే సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటేనే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి.


సిబిల్ తక్కువగా ఉంటే లోన్స్ ఇచ్చినా వాటిపై ఎక్కువ వడ్డీ వసూల్ చేస్తాయి. అందుకే సిబిల్ స్కోర్ ఎప్పుడూ తగ్గకుండా చూసుకోవడం చాలా బెటర్. అయితే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే కేవలం కొన్ని నెలల్లోనే దాన్ని 100 పాయింట్లకు పైగా పెంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

సిబిల్ స్కోర్ అంటే ఏమిటీ..?

సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్‌ అనేది క్రెడిట్ బ్యూరో సంస్థలు ఇచ్చే మూడంకెల సంఖ్య. ఇది మీ పాత క్రెడిట్ కార్డు లావాదేవీలు, లోన్ రీపేమెంట్లు వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా లెక్కిస్తారు. ఈ స్కోర్ లోన్ తీసుకునే విషయంలో మీరు ఎంత బాధ్యతగా ఉన్నారనే విషయాన్ని రుణదాతలకు తెలియజేస్తుంది.

సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి 6 ముఖ్యమైన చిట్కాలు

సిబిల్ స్కోర్ ఒక్క నెలలో పెరగకపోయినా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సులభంగా పెరుగుతుంది.

ఎప్పటికప్పుడు చెకింగ్..

క్రెడిట్ బ్యూరో సంస్థల అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తరచుగా చెక్ చేసుకోవాలి. రిపోర్ట్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే గుర్తించి, వాటిని సరిచేయడానికి రిపోర్ట్ చేయాలి. దీని వలన తప్పుల వల్ల తగ్గిన స్కోర్ వెంటనే పెరుగుతుంది.

సకాలంలో బిల్లులు చెల్లింపు

మీ పేమెంట్ హిస్టరీ మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం. క్రెడిట్ కార్డులు, లోన్స్, ఇతర బిల్లులను గడువు తేదీలోగా చెల్లించడం వలన సిబిల్ స్కోర్ వేగంగా పెరుగుతుంది. ఒక్క పేమెంట్ ఆలస్యమైనా స్కోర్ తగ్గుతుంది.

30శాతం లోపే ఉంచండి

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో నేరుగా సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. మీ క్రెడిట్ లిమిట్ లక్ష రూపాయలు ఉంటే..అందులో రూ. 30 వేలు మాత్రమే ప్రతి నెల ఖర్చు చేయాలి. అంతకు మించి ఖర్చు చేస్తే మీ స్కోర్ తగ్గుతుంది.

క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోండి

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను మెరుగుపరచడానికి మీ బ్యాంక్‌ను అడిగి క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవచ్చు. లిమిట్ పెరిగినా, మీరు ఖర్చు చేసే మొత్తం ఒకే విధంగా ఉంటే, మీ CUR శాతం తగ్గుతుంది. దీని వలన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఖర్చును నియంత్రణలో ఉంచుకోవడం ఇక్కడ కీలకం.

పాత అకౌంట్లను క్లోజ్ చేయవద్దు

చాలా మంది వాడని పాత బ్యాంక్ ఖాతాలు లేదా క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తుంటారు. పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకుండా యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిది. దీని వలన మీ మొత్తం క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి.. CUR పెరుగుతుంది. తద్వారా సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

కొత్త లోన్స్ – కార్డుల కోసం అప్లికేషన్లు

ఒకేసారి లేదా తక్కువ వ్యవధిలో ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా లోన్స్‌ కోసం దరఖాస్తు చేయకూడదు. ప్రతి దరఖాస్తుకు బ్యాంకులు హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీ చేస్తాయి. ఎక్కువ ఎంక్వైరీలు జరిగితే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి కొత్తగా లోన్‌కు అప్లై చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.

మంచి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై దృష్టి సారిస్తే.. మీ సిబిల్ స్కోర్ సులభంగా పెరిగి, మీకు సులభంగా రుణాలు, క్రెడిట్ కార్డులు పొందే అవకాశం లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.