మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఇలా చేస్తే ఈ సమస్య మళ్లీ రాదు!

Share Social Media

నేటి కాలంలో ప్రజల జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్లు ఒక భాగమైపోయాయి. మీరు గనుక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అది కొంత సమయం వరకు బాగా పని చేస్తుంది, తరువాత పాత బడటంతో దాని వేగం తగ్గుతుంది.

అయితే స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడానికి ప్రధాన కారణం దాన్ని వాడుతున్న వ్యక్తి. ఇలా ఎందుకు అంటున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదవండి. ఫోన్ వాడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కాష్ ఫైల్స్ క్లీనింగ్స్మ ర్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు కోసం, మనం ఎప్పటికప్పుడు కాష్‌ని క్లీన్ చేస్తూనే ఉండాలి. ఈ ఫైల్స్ మన ఫోన్‌లోని స్టోరేజీని నింపుతాయి. వీటి కారణంగానే చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మెరుగైన పనితీరు కోసం, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. స్మార్ట్ ఫోన్ రీసెట్ మీరు ఏ రకమైన స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించినా, కొంత సమయం తర్వాత మెరుగైన పనితీరు కోసం వాటిని రీసెట్ చేయాలి. దీంతో మీ ఫోన్ హ్యాంగ్ అవ్వదు. సగటున ఒక వినియోగదారు 5 నుండి 6 నెలలకు ఒకసారి ఫోన్‌ని రీసెట్ చేయాలి. రీసెట్‌తో మీ ఫోన్ కాష్ కూడా క్లియర్ అవుతుంది.

అప్‌డేట్,మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉంటాయి. కొన్ని బ్రాండ్‌లు నెలవారీ అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి, కొన్ని త్రైమాసికానికి ఉంటాయి. ఫోన్ పనితీరును పెంచడానికి, వినియోగదారులు పరికరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అయితే ఒక్కోసారి అప్ డేట్ కారణంగా ఫోన్ల స్పీడ్ కూడా తగ్గిపోతుంది. పరికరం చాలా పాతది కావడమే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. రీస్టార్ట్మీ ఫోన్ స్లో అయితే మీరు దానిని రీస్టార్ట్ చేయాలి. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్‌లో ఉన్న తాత్కాలిక ఫైల్స్‌ను తొలగిస్తుంది. దీనితో పాటు ఫోన్ మెమరీ కూడా క్లీన్ అవుతుంది. ఇది ఫోన్ వేగాన్ని మెరుగుపరుస్తుంది, హ్యాంగ్‌ అవడాన్ని నివారిస్తుంది.

Related News

Related News