టీ బ్యాగులను ముంచి టీ తాగడం మంచిది కాదా?

టీ బ్యాగ్స్‌తో టీ తాగడం చాలా మంది నిత్యజీవితంలో చేసే సాధారణపు అలవాటు. అయితే ఇది ఆరోగ్యపరంగా మంచిదా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. చాలా టీ బ్యాగ్స్ నైలాన్, పాలీప్రొపిలిన్, లేదా ప్లాస్టిక్‌తో కలిపిన ఫైబర్‌తో తయారవుతాయి. వేడి నీటిలో ఇవి మైక్రోప్లాస్టిక్స్ అణువుల‌ను విడుదల చేయగలవు, ఇవి శరీరంలోకి వెళ్లి కాలక్రమంలో హానికరంగా మారవచ్చు.


కొన్ని చౌక బ్రాండ్ల టీ బ్యాగ్స్‌లో పెస్టిసైడ్‌, లేదా బ్లీచింగ్ ఏజెంట్స్ (chlorine) ఉపయోగించే అవకాశం ఉంది. కొన్ని బ్యాగ్స్‌పై Epichlorohydrin అనే కెమికల్ ఉండవచ్చు. ఇది వేడిలో క్యాన్సర్ కారణమయ్యే పదార్థంగా మారుతుంది. కొన్ని టీ బ్యాగ్స్‌కి స్టేప్లర్, ప్లాస్టిక్ గ్లూ వంటివి వాడతారు. ఇవి కూడా వేడి నీటిలో విడిపోయే అవకాశముంది.

లూజ్ టీ ఆకులను వాడితే ప్లాస్టిక్ ఏమీ ఉండదు. బయోడియగ్రేడ్‌బుల్ టీ బ్యాగ్స్ (corn fiber, paper based) అని లేబుల్ ఉన్న వాటిని వాడటం ఉత్తమం. స్టీల్, గ్లాస్ టీ ఇన్‌ఫ్యూజర్ ఉపయోగించి ఆకులతో టీ త‌యారు చేసుకోవడం ఉత్తమమైన ఆరోగ్యకర మార్గం.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.