ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేస్తున్నారు ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్. అసలు తగ్గేదేలే అనే పదానికి పేటెంట్ హక్కు తీసుకుందామని అభిమాన స్టార్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు.
స్టైలిష్ హీరో ఇప్పుడున్న జోరు చూస్తుంటే అసలు తగ్గడం గురించి ఎవరైనా ఎందుకు ఊహిస్తారు చెప్పండి? అసలే పుష్ప మూవీతో నేషనల్ లెవల్ అప్రిషియేషన్ అందుకున్నారు బన్నీ.
ఇప్పుడు పుష్ప2 బిజినెస్ గురించి స్పెషల్ గాచెప్పాల్సిన పనిలేదు. వెయ్యికోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తారంటూ పొరుగువారే హ్యాపీగా స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు.
అలాంటిది పుష్ప2 తర్వాత బండి ఇక ఆగుతుందా చెప్పండి.. రయ్యి రయ్యి మంటూ టాప్ గేర్‌లో స్పీడందుకోదూ… ఆ స్పీడ్‌ని అందుకోవడానికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు ఏడాదిన్నర టైమ్ కావాలని అడిగారట త్రివిక్రమ్.
అసలే హ్యాట్రిక్ సక్సెస్ ఉన్న కాంబో కాబట్టి, ఈ సారి రంగంలోకి దిగితే రంగేళీ అద్దిరిపోవాలన్నది గురుజీ టార్గెట్. అద్భుతమైన కథకు ఫాంటసీని మిక్స్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదిన్న ప్రీ ప్రొడక్షన్ అంటే స్టార్ట్ కావడానికి ఎట్టలేదన్నా 2025 ఎండింగ్ అవుతుందన్నది గ్యారంటీ. అప్పుడే ప్రారంభిస్తారా? లేకుంటే 2026లో ఫ్రెష్‌గా మొదలుపెడతారా? అంటూ లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.