కర్బూజ తీపి రుచితో ఉండే వేసవి పండు. ఈ పండులో అనేక ఇతర పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం మన శరీరం నీటిని కోరుతుంది. నీరు తాగడం వేసవిలో చాలా అవసరం. అయితే నీళ్ళు ఎక్కువగా తాగనివారు కర్బూజాలను తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయ వంటి అనేక పండ్లలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. కర్బూజ పండుని స్వీట్ మెలన్ అని కూడా అంటారు. ఇది రిఫ్రెష్ ఫ్రూట్. అంటే తాజాదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో వివిధ పోషకాలను అందుకోవడానికి ప్రతిరోజూ ఈ పండ్లను తీసుకోవాలి.
కర్బూజలో పొటాషియం ఉంటుంది. ఇది మీ రక్తపోటుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్బూజ పండులో అధిక ఫైబర్, నీటి కంటెంట్ కూడా రక్తపోటును నియంత్రించడానికి దోహదం చేస్తాయి. కర్బూజ పండును ముక్కలుగా చేసి సాయంత్రం స్నాక్‌గా లేదా రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కర్బూజ పండులో నీరు, ఫైబర్ కంటెంట్ మీ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఈ పండు తినడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ పొట్టపై శీతలీకరణ ప్రభావాన్ని కూడా చూపుతుంది. కర్బూజలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడానికి పనిచేస్తుంది. దీంతో శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ తాకదు. వేడి తగ్గుతుంది.
కర్బూజ మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి అనుకూలమైన కొల్లాజెన్‌ను అందజేస్తుంది. దీంతో చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ చర్మానికి మేలు జరుగుతుంది. ఇది ఫేస్ ప్యాక్‌లను సిద్ధం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ ఆహారంలో కర్బూజాని చేర్చుకోవడం వల్ల మీకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కర్బూజాల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. బీపీని అసలు రానివ్వకుండా చూస్తుంది. అలాగే రక్తనాళాలను కడిగేసినట్లు క్లీన్ చేస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా కర్బూజాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని తినడం మిస్ చేసుకోకండి.