ఈ ప్రదేశాల్లో ఎల్లప్పుడూ చీకటి కాదు.. 24 గంటలు సూర్యుడు అస్తమిస్తూనే ఉంటాడు

ప్రపంచంలో ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవే కాకుండా వింత ప్రదేశాలు కూడా ఉన్నాయి. చాలామంది ప్రజలు ఈ వింత ప్రదేశాలను ఎక్కువగా సందర్శించేందుకు ఇష్టపడుతూ కూడా ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రదేశం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇక్కడ సూర్యుడు 24 గంటల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడట. అంతేకాకుండా చీకటనే మాట ఇక్కడ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలా చీకటి కానీ ప్రదేశాలను “మిడ్నైట్ సన్” అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాల్లో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించడని వాటిని నార్త్ కేఫ్ తో పాటు స్పిట్స్‌బెర్గెన్ వంటి ప్రదేశాలలో చూడొచ్చు. ఇక్కడ 24 గంటల పాటు వెలుతురే ఉంటుంది. అంతేకాకుండా చీకటనే ముచ్చట మాట ఉండదు.

ముఖ్యంగా స్వీడన్ లోని ఉత్తరభాగాల్లో “మిడ్నైట్ సన్” ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కిరునా, అబిస్కో వంటి నగరాల్లో ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడట. దీని కారణంగా పర్యాటకులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అందమైన సరస్సులు, అడవి ప్రదేశాలను సందర్శిస్తారట.

ఈ “మిడ్నైట్ సన్” ఫిన్లాండ్‌లోని లాప్‌లాండ్ ప్రాంతంలో కూడా ఉంటుందట.. ఇక్కడ దాదాపు 73 రోజుల పాటు సూర్యుడు అస్తమిస్తూనే ఉంటాడు. ఇక్కడ రాత్రి 12 అయినా ఏమాత్రం చీకటి కాకుండా సూర్యుడు తన కాంతిని వెదజల్లుతూనే ఉంటాడు.. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో 80 రోజులపాటు కూడా చీకటి కాకుండా ఉంటుందట.

జూన్ జూలై నెలల్లో ఐస్లాండ్ లోని కూడా కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు 24 గంటల పాటు ఉంటాడట. ఇక్కడ కూడా చీకటి కాదని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మిడ్‌నైట్ సన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతర కొన్నిచోట్ల కూడా సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.

అలాస్కాలోని కొన్ని ప్రదేశాల్లో ప్రతి ఏడాది మే తో పాటు జూలై నెలలో సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడట. ఇక్కడ కూడా ఎప్పుడూ చీకటి కాదని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పర్యాటకులు కూడా ఈ ప్రదేశాల్లోకి ఎక్కువగా వస్తూ ఉంటారని సమాచారం. అలాగే చలి తీవ్రత కూడా ఈ సమయంలో కాస్త తక్కువగా ఉంటుందట.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.