షర్మిల కుమారుడి వివాహ వేడుకకు జగన్‌ దూరం

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాలేదు.
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాలేదు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శనివారం షర్మిల తనయుడి వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకకు వైఎస్‌ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు.

వైయస్ షర్మిల రెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుక జనవరి 18వ తేదీన హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడైన ఏపీ సీఎం జగన్ తో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు.