Jagan warning to police officer: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్
Jagan warning to police officer: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఓ పోలీసు అధికారికి జగన్ వార్నింగ్ ఇచ్చా రు. నల్ల కండవాలు ధరించి ప్లకార్డ్స్‌తో అసెంబ్లీకి వస్తున్నారు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు పోలీసులు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. నేతలు నల్ల కండవాలు ధరించి ప్లకార్డ్స్ పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్లకార్డులను సభలోకి అనుమతించేది లేదని రిక్వెస్ట్‌గా పోలీసులు చేప్పారు. శాసనసభ సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మీదన్నారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురయ్యారు మాజీ సీఎం జగన్. మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ మదుసూధన్ అనే పోలీసు అధికారిపై చిందులేశారు. మధుసూదన్‌రావు.. గుర్తు పెట్టుకో.. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటూ హెచ్చరించారు. తాము తీసుకొస్తున్న పేపర్స్ చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. టోపీకి ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా? అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టాలన్నారు.
నల్ల కండువాతో అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్#AndhraPradesh #APnews #Ysrcp #Ysjagan #APAssemblySessions #TeluguNews #NewsUpdates #Bigtvlive #SayNoToDrugs pic.twitter.com/9ScuffUccF
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2024