వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇవాళ(బుధవారం) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో (Bangarupalem) పర్యటిస్తున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్‌లో రైతులను పరామర్శించి వారి సమస్యల గురించి జగన్ తెలుసుకుంటున్నారు. వైసీపీ అధినేత పర్యటన సందర్భంగా పలు ఆంక్షలు విధించారు చిత్తూరు జిల్లా పోలీసులు.
షరతులతో కూడిన అనుమతులని ఇచ్చారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. మార్కెట్ యార్డులో 500మంది, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైసీపీ మూకల వీరంగం..
అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్ యార్డ్‌లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
































