అవును సైన్యం డీలా పడింది. నడిపించాల్సిన రాజు మాటలను విని సైన్యం నివ్వెరపోయి డీలా పడింది అని అంటున్నారు. రాజు గట్టిగా నిలబడాలి. గెలుపు మనదే అని చాటాలి.
నేనే రాజుని అని కూడా బిగ్ సౌండ్ చేయాలి. కానీ యుద్ధం ఎవరి కోసమో చేస్తూ సైన్యాన్ని నడవమంటే సైనికులు కచ్చితంగా డీలా పడతారు.
ప్రస్తుతం జనసేనలో అదే జరుగుతోంది అని అంటున్నారు. ఇలా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలను చూసి అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ గా నిండు శాసనసభలో బాబు అయిదు కాదు మరో పదేళ్ళు సీఎం అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అంటే ఈ అయిదూ కలుపుకుంటే ఏకంగా పదిహేనేళ్ళు అన్న మాట. ఒక మనిషి జీవిత కాలంలో కానీ రాజకీయ పార్టీల జీవిత కాలంలో కానీ టైం కే ఎక్కువ విలువ ఉంటుంది.
అందునా రాజకీయాల్లో సీఎం సింహాసనం పట్టాలని అనుకున్న వారికి అయిదేళ్ళూ భారంగా గడుస్తాయి. వైసీపీ ప్రస్తుతం అదే భారంతో తల్లకిందులు అవుతోంది. మరి జనసేనలో అయితే ఆశలు రెట్టింపుగా ఉన్నాయి. అవి ఏ రోజుకి ఆరోజు మరింతగా పెరుగుతున్న వేళ పవన్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ టో శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయని అంటున్నారు
ఎపుడైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న జనసేన సైనికులకు పవన్ తాజా పోకడలు నిరాశలో ముంచుతున్నాయా అని అంటున్నారు. పవన్ తో ఉంటూ ఆయనను కాపు కాస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న అపరిమితమైన అభిమాన జనం ఆయనే సీఎం గా భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం మరో పది నుంచి పదిహేనేళ్ళ పాటు బాబే ఏపీకి సీఎం అని చెబుతున్న మాటలు వారికి ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు
మరి పవన్ పాలిటిక్స్ ఆయన వ్యూహాలు ఇదే విధంగా ఉంటే ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని అంటున్నారు. ఏపీ పాలిటిక్స్ చూస్తే సామాజిక వర్గాల పరంగా చీలిపోయి ఉంది. చంద్రబాబుకు కమ్మలు, జగన్ కి రెడ్లు మద్దతు ఇస్తున్నట్లే పవన్ కి బలమైన కాపుల మద్దతు ఉంది అని అంటారు అయితే పవన్ ఇపుడు ఇచ్చిన స్టేట్ మెంట్ తో జనసేన నాయకులకు అభిమానులకే కాదు ఒక బలమైన సామాజిక వర్గానికి కూడా ఏమీ అర్ధం కాకుండా పోయిందని అంటున్నారు.
పవన్ ఇంత బోల్డ్ గా సమయం సందర్భం కూడా చూసుకోకుండా ఈ రకమైన స్టేట్ మెంట్ అది కూడా నిండు శాసనసభలో ఇస్తారని అసలు ఊహించలేకపోతున్నామని వారు అంతా అంటున్నారు. పవన్ ఆవేశంతో చేసిన స్టేట్ మెంట్స్ ఆ తరువాత ఇబ్బందులు తెస్తాయని కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన పవిత్రమైన శాసన సభలో ఈ ప్రకటన చేశారు అని కూడా గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు.
పవన్ లో సీఎం అవాలని ఉందా లేదా అన్నది పక్కన పెడితే తమ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో ఇపుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీ ఇబ్బందులో ఉంది. ఈ టైం లొ అధికారంలో ఉన్న జనసేన వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన తరుణం అని గుర్తు చేస్తున్నారు
అటువంటిది ఈ సమయంలో ఈ తరహా ప్రకటనల వల్ల పార్టీ బలోపేతం కాదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన థర్డ్ ఫోర్స్ గా జనసేన ఉంటుందని భావించి ఇటీవల కాలంలో చాలా మంది ఆ పార్టీలో చేరారు. మరి వారి చేరిక పక్కన పెడితే పవన్ తాజా ప్రకటనలతో కొత్త వారు ఈ వైపునకు వస్తారా అని కూడా చర్చ సాగుతోంది.
ఎటూ కూటమికి అధికారం మరో నాలుగున్నరేళ్ళ పాటు నిండుగా ఉంది కాబట్టి ఇప్పటికిపుడు జనసేనకు ఏమీ కాకపోయినా లాంగ్ టెర్మ్ లో మాత్రం పవన్ ఉదార వాద రాజకీయానికి భారీ మూల్యమే పార్టీ చెల్లిస్తుందని అంటున్నారు. జనసేన ఈ రకమైన వైఖరి తీసుకుని బాబే సీఎం మేము పక్క వాయిద్యం అని చెప్పుకుంటే ఆ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమవుతుందని అంటున్నారు.
ఇక పార్టీలోనే ఉంటున్నా ఇప్పటికే కూటమిలో టీడీపీ వర్సెస్ జనసేనగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కధ సాగుతోంది. అది రేపటి రోజున మరింతగా ముదిరే చాన్స్ ఉందని అంటున్నారు. మరో పదేళ్ళ పాటు బాబే సీఎం అన్న పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆసరాగా చేసుకుని టీడీపీ శ్రేణులు దూకుడు చూపిస్తే జనసేన వర్గాలు కూడా రివర్స్ లో కౌంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. దాంతో కూటమిలో కుమ్ములాటలకు కూడా ఇది ఆస్కారం కల్పించే వీలు ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఇచ్చిన ఈ తరహా ప్రకటనలు జనసేనకు దీర్ఘ కాలంలో మేలు చేసేవి కావనే అంటున్నారు.
నిజానికి పవన్ కి రాజ్య కాంక్ష లేకపోవచ్చు. కానీ ఆయనతో ఉన్న వారికి అది ఉందని అంటున్నారు. అది సహజం కూడా జనసేన అధికారం చేపడితే మంత్రి పదవుల నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ మందికి చాన్స్ వస్తుందని అలా తమ రాజకీయాన్ని కొత్త పార్టీలో చూసుకోవచ్చు అనుకున్న వారు మరో దశాబ్దం పాటు పొత్తు పార్టీగానే ఉందామంటే కుదిరేది ఎలా అన్నది కూడా ఒక బిగ్ డిబేట్ గా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.