‘కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది’ అంటూ ఫిల్మ్ ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్టు పై స్పందిస్తూ జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు.
“తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్దర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును తమకు అనుకూలంగా, నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్తులు పెడుతున్నారు”.
మీ నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుంది..
“మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో.. కానీ అసలు తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు మరెంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది.. నిజం అందరికీ తెలుస్తుంది అని ట్వీట్ చేశారు. ”
నటి జాన్సీ పెట్టిన పోస్ట్ ఏంటి?
మంగళవారం సాయంత్రం నటి ఝాన్సీ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అంటూ పోస్ట్ పెట్టారు. వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చిన ఆర్దర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ని ఆశ్రయించిన జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ కేసును నెగ్గింది. కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను తోసిపుచ్చింది. దీంతో వర్క్ ప్లేస్ లో మహిళలకు రక్షణ ఎంత ముఖ్యమైనది అనేది ప్రూవ్ అయిందని. అలాగే ప్రతి సంస్థలోనూ పోష్ రూల్స్ ఉండాలని కూడా మరోసారి రుజువైందని ఝాన్సీ అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో ఫెడరేషన్ తో కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.