Jayalalitha: జయలలిత ఆస్తులు మొత్తం తమిళనాడుకే..

దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14,15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఎ మోహన్ అధికారులను ఆదేశించారు.


జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పుల, గడియారాలు, ఇతర వస్తువులను కర్నాటక ప్రభుత్వం అప్పగించనుంది.

ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్, జె.దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్నాటక హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుమారు పదేళ్ల క్రితం తమిళనాడు సర్కార్ స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ. 4000కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.