వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ – ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం

ఏపీ రాజకీయాల్లో సోమవారం మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని జేసీ వర్గాలు తెలిపాయి.


ఏపీ రాజకీయాల్లో సోమవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ఆయన ఆమెతో సమావేశమయ్యారు. విజయమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగ్గా.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని.. మామూలుగానే కలిశారనే జేసీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.