జియో హాట్‌స్టార్ బంపర్ ఆఫర్.. మొత్తం సినిమాలు అన్నీ ఫ్రీగా చూడొచ్చు అంటూ ప్రకటన

ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా.. ప్రముఖ ఓటీటీ సంస్థ


తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకులను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఉన్న మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులో తీసుకురానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అంటూ భాషా బేధం లేకుండా ఆల్ లాంగ్వేజస్‌లో ఉన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు మొత్తం కంటెంట్‌ను పబ్లిష్ చేయనుంది. ‘ఆపరేషన్ తిరంగ’ అనే పేరుతో ఆడియన్స్‌కు అందించనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఆగస్టు 15వ తేదీ రోజు మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.