రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ఆఫర్ ని ప్రకటించింది. కొత్త సంవత్సరం కోసం ఈ కొత్త ఆఫర్ ని రిలయన్స్ జియో అందించింది. జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్ తో ఎంత ఖర్చుతో అయితే రీఛార్జ్ చేస్తారో, అంత ధరకు లాభాలను అందుకోవచ్చు.
రిలయన్స్ జియో సరికొత్తగా అందించిన ఈ ఆఫర్ ఏమిటో చూద్దామా.
Jio New Offer:
జియో లేటెస్ట్ గా ప్రకటించిన Jio New Year 2025 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే రూ. 2025 రూపాయల ధరతో ఈ ప్లాన్ ను అందించింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ఫుల్ అమౌంట్ కు సమానమైన బెనిఫిట్స్ ను అందిస్తుంది.
జియో రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే, 4G నెట్ వర్క్ పై డైలీ 2.5GB డేటాని 200 రోజులు అందిస్తుంది.
ఇక ఈ ప్లాన్ తో అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో మూడు అదనపు ప్రయోజనాలు అందించింది. మొదటిది, EaseMyTrip.com ద్వారా బుక్ చేసే ఫ్లైట్ టికెట్ పై రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. రెండవది, Ajio పై రూ. 2,999 రూపాయలు లేదా అంతకంటే పై చిలుకు షాపింగ్ చేసే వారికి రూ. 500 తగ్గింపు లభిస్తుంది. మూడవది, స్విగ్గి లో రూ. 499 ఆర్డర్ చేస్తే రూ. 150 తగ్గింపు లభిస్తుంది. ఈ మొత్తం ప్రయోజనాలు లెక్కిస్తే టోటల్ రూ. 2,150 అవుతుంది.
అయితే, యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ఇది లిమిటెడ్ ప్లాన్ మరియు దిద`ఈ ప్లాన్ డిసెంబర్ 11 ముక్కుని జనవరి 11 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిగా లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అని గుర్తుంచుకోండి.