జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో పోర్ట్‌ఫోలియోలో అనేకే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ధరలోనే రీఛార్జ్ ప్లాన్లు ఎంచుకోవచ్చు.
జియో అద్భుతమైన (Jio Cheapest Plan) ప్లాన్‌తో ఫ్రీ డేటాను పొందవచ్చు.
రిలయన్స్ జియో కస్టమర్ అయితే ప్రతిరోజూ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. జియో అందిస్తున్న ఈ ప్లాన్‌తో 20GB వరకు ఫ్రీ హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఇంతకీ జియో అందించే ఈ ప్లాన్ ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.
జియో 749 ప్లాన్ (Jio Cheapest Plan) :
రిలయన్స్ జియో రూ. 749 ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌లో 20GB వరకు అదనపు డేటా కూడా పొందవచ్చు. జియో ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100SMS కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో 144GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 20GB ఫ్రీ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 164GB డేటాను అందిస్తుంది.
ఈ ప్లాన్ 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్,టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. అదనంగా, ఫ్రీగా 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తుంది. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
































