చౌక ధరకే జియో కొత్త ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల పాటు ఆనందించవచ్చు.

రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. నెలవారీ రీఛార్జ్ చేయనక్కర్లేదు. జియో (Reliance Jio) పోర్ట్‌ఫోలియోలో అతి చౌకైన ధరకే కొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది.


మొబైల్ యూజర్లు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. సిమ్ కార్డును 336 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.

నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరగడంతో జియో కస్టమర్లలో లాంగ్ వాలిడిటీ ప్లాన్‌లకు డిమాండ్ పెరిగింది. కస్టమర్ల కోసం జియో జాబితాలో నెల కన్నా ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌లను పెంచింది.

దీర్ఘకాలిక వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు :
జియో అనేక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. జియో జాబితాలో 84 రోజులు, 90 రోజులు, 98 రోజులు, 200 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.

ఇప్పుడు జియో సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా వినియోగదారులు సిమ్ కార్డును 11 నెలలు చౌకైన ధరకు పొందవచ్చు. జియో రూ. 2వేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది.

మీరు 365 రోజుల ప్లాన్‌పై రూ.3599 వద్దని భావిస్తే.. దాదాపు సగం ధరకు రూ.1748 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో కస్టమర్లకు 336 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీని అందిస్తోంది.

రూ. 1748 ప్లాన్‌లో జియో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. కంపెనీ ఫ్రీ కాలింగ్‌తో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఫ్రీ SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 336 రోజుల పాటు మొత్తం 3600 ఫ్రీ SMS కూడా పొందుతారు.

మీరు ఇంటర్నెట్ డేటా అవసరమైతే రూ.1748 ప్లాన్‌లో డేటా రాదని గమనించాలి. ఈ ప్లాన్ వాయిస్ ఓన్లీ ప్లాన్. ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అదనపు ఆఫర్లను అందిస్తోంది.

లాంగ్ వాలిడిటీ ప్లాన్ అవసరమైతే.. రూ.2025 ప్లాన్‌ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 200 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5GB డేటాను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.