జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్

దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.


దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.

ఇతర రీఛార్జ్ ప్లాన్స్!
రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్‌ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.

రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.