ఈనెల 7న గుడివాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఉదయం 9:00 గంటలకు గుడివాడలోని కేటీఆర్ ఉమెన్స్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
































