నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.కేవలం డిగ్రీ అర్హతతోనే రూ. 1.10లక్షల జీతం పొందే గోల్డెన్ ఛాన్ వచ్చేసింది. 224 పోస్టులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 5 లోగా అప్లై చేసుకోవాలని కోరింది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
మొత్తం పోస్టుల సంఖ్య : 224 జూనియర్(ఫైర్ సర్వీస్), సీనియర్ అసిస్టెంట్(అఫీసియల్ లాంగ్వేజ్),సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్),సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)
అప్లికేషన్ ప్రారంభం : ఫిబ్రవరి 4, 2025
అప్లికేషన్ ముగింపు తేదీ:05 మార్చి, 2025
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
వయోపరిమితి: వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
పరీక్ష విధానం:ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
వేతనం:రూ. 36,000 నుండి 1,10,000 వరకు ఉంటుంది.
అప్లై ఎలా: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 లోపు దరఖాస్తు పూర్తి చేయాలి.