డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్ రెడీ.. నెలకు రూ. 57 వేల జీతం

www.mannamweb.com


మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా?

అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకుల్లో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది.

భర్తీ కానున్న పోస్టుల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ 50, స్టాఫ్‌ అసిస్టెంట్/ క్లర్క్‌ 201 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టుండాలి. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 31.10.2024 నాటికి 20 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.26,080- రూ.57,860 వరకు జీతం ఉంటుంది. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 22 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం apcob.org/careers/ వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు ibpsonline.ibps.in/dccbmarc24/వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.