ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. రాత పరీక్ష లేదు.. నెలకు రూ. 50 వేల జీతం

www.mannamweb.com


ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష లేకుండానే ఎయిర్ పోర్టులో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 50 వేలు పొందొచ్చు. తాజాగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎన్ఎస్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ రిటైర్డ్ అధికారులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 70 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులను పర్సనల్/వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోల్‌కతాలోని ఏఏఐ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.50,000 ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

ఎయిర్‌ఫోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా సీఎన్ఎస్ లో 215 జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

అర్హత:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ రిటైర్డ్ అధికారులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి:

అభ్యర్థుల వయసు గరిష్టంగా 70 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులను పర్సనల్/వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోల్‌కతాలోని ఏఏఐ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.

జీతం:

జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.50,000 ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:

15-09-2024