డిగ్రీ అర్హతతో ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కొలువు సొంతం

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతలతో బ్యాంకు ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌.. రాష్ట్రంలోని గుంటూరు, చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అర్హత ప్రమాణాలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 28వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు..

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీల సంఖ్య: 17
గుంటూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 7
చిత్తూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 1

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాంకింగ్/ కామర్స్/ అకౌంటింగ్ అండ్ ఆడిట్/ అగ్రికల్చర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థికి తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో చదవటం, రాయడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయోపరిమితి సెప్టెంబర్‌ 01, 2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు తప్పనిసరిగా సెప్టెంబర్‌ 1, 1996 నుంచి సెప్టెంబర్‌ 1, 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 28, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అప్రెంటీస్‌ శిక్షణ కాలం ఏడాది ఉంటుంది. ఈ ఏడాది కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌, డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలక్షన్‌ ప్రాసెస్‌లో భాగంగా నిర్వహించే లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్‌లలో తెలుగు మీడియంలో చదివిన వారు లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌కి అర్హులు కాదు. ఈ టెస్ట్‌లో అర్హత సాధించని వారిని అప్రెంటీస్‌గా ఎంపిక చేయబోమని APCOB తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అసక్తి కలిగాన వారు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ఈ కింది అడ్రస్‌కు పంపించవచ్చు.

అడ్రస్..

ది డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ-520002.