ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో జాబ్స్.. నెలకు 47 వేల జీతం.. అర్హులు వీరే

www.mannamweb.com


ఉద్యోగం ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ ను మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తనతో పాటు కుటుంబం స్థితి గతులు కూడా మారిపోతాయి. అందుకే గవర్నమెంట్ జాబ్స్ వాల్యూ తెలిసిన వారు తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహిస్తుంటారు. కాస్త టైమ్ ఎక్కువ తీసుకున్న పర్లేదు గానీ ప్రభుత్వ కొలువు కొట్టాలని చూస్తుంటారు. వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్స్ కు పంపిస్తుంటారు. యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఏళ్ళకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వదలకుండా పోటీపడుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ను బట్టి పలు రకాల జాబ్స్ ఉంటాయి.

మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 47 వేల జీతం పొందొచ్చు. అయితే ఈ జాబ్స్ కు ఇంజనీరింగ్ డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. తాజాగా ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL), సైనిక వాహనాల తయారీలో వివిధ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్‌తో సహా పలు పోస్టులు భర్తీ కానున్నాయి.

అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వర్గాల వారికి 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జూనియర్ మేనేజర్ కు రూ. 47,610, డిప్లొమా టెక్నీషియన్ కు రూ. 37,201, అసిస్టెంట్ కు రూ. 37,201, జూనియర్ టెక్నీషియన్ కు రూ. 34,227 చెల్లిస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ. 300​. ఎస్సీ/ఎస్టీ, పీడబ్య్లూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 11 వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్నాథ్, జిల్లా. థానే, మహారాష్ట్ర, పిన్: 421 502. పూర్తి సమాచారం కోసం avnl.co.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.