భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో జాబ్స్.. నెలకు 79 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

www.mannamweb.com


కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని అబ్ధుల్ కలాం అన్నారు. కలల్ని నిజం చేసుకునేందుకు కష్టపడకపోతే ఫలితం ఏమీ ఉండదు. జాబ్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుని దానికోసం నిరంతరం శ్రమిస్తే విజయం మీ వెంటే వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ హెవీగా ఉంది. అలా అని ప్రయత్నం మానుకోవద్దు. ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు. మరి మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభత్వ రంగ సంస్థ అయినటువంటి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ-భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్న హవల్దార్‌ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 15 హవాల్దార్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు టెన్త్, నిర్థిష్ట శారీరక ప్రమాణాలతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు 43 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 20500-79000 వరకు అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 3 వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:
హవల్దార్‌ (సెక్యూరిటీ) పోస్టులు మొత్తం: 15
అర్హత:

పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

43 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 20500-79000 వరకు అందుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ:

03-09-2024