భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెలికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఖాళీలను BSNL విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, 120 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 27న రిలీజ్ అయ్యింది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ & ఇన్స్ట్రుమెంటేషన్ మొదలైన వాటిలో కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE)/బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) డిగ్రీ. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్ స్ట్రీమ్) కోసం, చార్టర్డ్ అకౌంట్ (CA) లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (CMA) డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. విద్యా అర్హతలకు మించి అనుభవం అవసరం లేదు, కాబట్టి ఇటీవల చదువు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి విషయానికి వస్తే.. కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ. 24,900- రూ. 50,500, ఇతర అలవెన్సులతో పాటు ఉంటుంది. ఈ నియామకానికి సంబంధించిన దరఖాస్తు తేదీలు, పరీక్ష ఫీజులు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్‌లు వంటి సమాచారాన్ని BSNL త్వరలో విడుదల చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
































