ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఇదే మంచి ఛాన్స్. పలు ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. మంచి వేతనంతో పాటు లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 56 వేల జీతం అందుకోవచ్చు.
బీఐఎస్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 345 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇందులో గ్రూప్ ఏ, బీ, సీ పోస్టులు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 27 నుంచి 35 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 345
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
ప్రాక్టికల్ అసెస్‌మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ:
30-09-2024