జాబ్ వస్తే లైఫ్ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ సాధించలేని వారు ప్రైవేట్ సెక్టార్ లో స్థిరిపడిపోతుంటారు. మరికొందరు బిజినెస్ చేస్తూ సెటిల్ అయిపోతుంటారు. బిజినెస్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా టెన్షన్ తో కూడుకున్నవే. ఎప్పుడు నష్టాలు వస్తాయో తెలియదు. ప్రైవేట్ జాబ్ ఎప్పుడు ఊడుతుందో చెప్పలేము. అదే గవర్నమెంట్ కొలువులు కొడితే సెక్యూరిటీ ఉంటుంది. కుటుంబమంతా చీకూచింత లేకుండా బ్రతికేయొచ్చు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? మంచి ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను వదులుకోకండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 253 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో చీఫ్ మేనేజర్స్ ఇన్ సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-IV పోస్టులు 10, చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-III పోస్టులు 56, చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-II పోస్టులు 162, చీఫ్ మేనేజర్స్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I పోస్టులు 25 ఉన్నాయి.
ఈ పోస్టులకు పోటీపడే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు స్కేల్-IV పోస్టులకు 34- 40 ఏళ్లు, స్కేల్-III పోస్టులకు 30- 38, స్కేల్-II పోస్టులకు 27- 33, స్కేల్-I ఖాళీలకు 23- 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి స్కేల్-IV పోస్టులకు రూ.1,02,300- 1,20,940, స్కేల్-III పోస్టులకు రూ.85,920- రూ.1,05,280, స్కేల్-II పోస్టులకు రూ.64,820- రూ.93,960, స్కేల్-I పోస్టులకు రూ.48,480- రూ.85,920 వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.850+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175+ జీఎస్‌టీ చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు.