మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. మంచి జీతం అందుకోవచ్చు. మీకు ఈ అర్హతలు ఉన్నట్లైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇటీవల నాసిక్(మహారాష్ట్ర)లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించి ఐటీఐ స్ట్రీమ్‌లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, టూల్–డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ తదితర ట్రేడుల్లో నియామకాలు జరుగనున్నాయి. ఈ పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు ఏడాది కోర్సుకు రూ.7700, రెండేళ్ల కోర్సుకు రూ.8,050 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 324.
అర్హత:
సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైఫండ్:
నెలకు ఏడాది కోర్సుకు రూ.7700, రెండేళ్ల కోర్సుకు రూ.8,050.
దరఖాస్తు ప్రారంభతేది:
08-08-2024
దరఖాస్తులకు చివరితేది:
31-08-2024