మీరు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 96 వేల వరకు జీతం అందుకోవచ్చు. లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోకండి. మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేస్తారు? ఆ వివరాలు మీ కోసం.
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నది. పోస్టులను అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ, ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల నుంచి రూ. 96 వేల వరకు అందిస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్/ ఓబీసీ / ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 29 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు: 170
అర్హత:
పోస్టులను అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ, ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల నుంచి రూ. 96 వేల వరకు అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ ఓబీసీ / ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
10-09-2024
దరఖాస్తులకు చివరి తేదీ:
29-09-2024