డిగ్రీ, బీటెక్ పాసైన వారికి ఎల్ఐసీలో జాబ్స్.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

చదువు పూర్తయ్యి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC Recruitment) ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ నోటిఫికేషన్ ద్వారా 841 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 8వ తేదీతో గడువు ముగియనుంది. లాస్ట్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి, ఆసక్తి ఉన్నవారు వెంటనే అధికారిక వెబ్ సైట్ licindia.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు నెలకు రూ.లక్షా 20 వేలకుపైగా జీతం ఉంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులు 81
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్ పోస్టులు 410
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జర్నలిస్ట్ పోస్టులు 350

విద్యార్హతలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు B.E./B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి పొందాలి.

AAO స్పెషలిస్ట్, AAO జర్నలిస్ట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏ ఫీల్డ్‌లో గ్రాడ్యుయేట్ చేసినవారైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుగా ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ SC/ST/OBC/PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
LIC AAO, AE ఎంపిక ప్రక్రియలో రెండు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్. రెండవది మెయిన్స్ ఎగ్జామ్. ఈ రెండు దశల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినవారు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానానికి ఎంపిక అవుతారు.

దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD అభ్యర్థులు రూ.85, ఇతర అభ్యర్థులు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.