భారీ జీతంతో LICలో ఉద్యోగాలు

ద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గుడ్ న్యూస్ ప్రకటించింది. లేటెస్ట్ గా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం 841 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 8, 2025 వరకు అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ (licindia.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఈ ఛాన్స్ వినియోగించుకోవాలి.

ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలు: 841

అసిస్టెంట్ ఇంజనీర్ (AE) – 81 పోస్టులు

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 410 పోస్టులు

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) – 350 పోస్టులు

AAO గా ఎంపికైన వారు భవిష్యత్తులో డిపార్ట్‌మెంట్ మేనేజర్, జోనల్ మేనేజర్, డైరెక్టర్ స్థాయిలకు ఎదగవచ్చు.

AE గా ఎంపికైన వారు ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, టెక్నికల్ హెడ్స్ వరకు ప్రమోషన్లు పొందవచ్చు.

విద్యార్హత..

AE పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ తప్పనిసరి. AAO పోస్టులకు బిజినెస్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం.

వయోపరిమితి..

21 నుంచి 30 సంవత్సరాల మధ్య. (SC/ST/BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది).

దరఖాస్తు రుసుము..

SC/ST/దివ్యాంగులు: రూ.85 + ట్రాన్సాక్షన్ ఛార్జీలు + GST

ఇతర వర్గాలు: రూ.700 + ట్రాన్సాక్షన్ ఛార్జీలు + GST

ఫీజు ఆన్లైన్‌ లోనే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ..

1. ప్రిలిమినరీ పరీక్ష

  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ పేపర్లు ఉంటాయి.
  • కేవలం అర్హత సాధనకు మాత్రమే. మార్కులు తుది మెరిట్‌లో లెక్కించబడవు.

2. మెయిన్ పరీక్ష

  • ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఆర్థిక వ్యవహారాలు, లాజికల్ అబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ వంటి సబ్జెక్టులు ప్రధానంగా ఉంటాయి.
  • ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించబడుతుంది.

3. ఇంటర్వ్యూ (Interview)

  • కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వం, సమస్య పరిష్కార నైపుణ్యం, లీడర్‌షిప్ సామర్థ్యాలను పరిశీలిస్తారు.

4. మెడికల్ టెస్ట్

  • చివరి దశలో అభ్యర్థి శారీరక & మానసిక ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు.

జీతభత్యాలు & ప్రయోజనాలు..

  • ప్రారంభ స్థాయిలో రూ.53,600 – రూ.1,02,090 వరకు జీతం (అలవెన్సులు సహా).
  • హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), డియర్‌నెస్ అలవెన్స్ (DA), ట్రావెల్ అలవెన్స్ (TA) లభిస్తాయి.
  • పెన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్, లీవ్ ఎంకాష్‌మెంట్ వంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు ఉంటాయి.

ప్రిపరేషన్..

ప్రిలిమ్స్..

రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి.

మెయిన్స్..

ఫైనాన్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌పై బలమైన అవగాహన కలిగి ఉండాలి.

అలానే ప్రతిరోజూ మాక్ టెస్టులు రాయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ పెరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ కోసం నిత్యం న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ చదవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.