రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. గంటకు రూ.1000 వరకు జీతం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. దీని కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌కి వెళ్లి ఫారమ్ నింపాలి.

మీరు ఒక డాక్టర్ అయితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలని కలలు కంటుంటే మీ కోసం గుడ్‌న్యూస్. ఆర్‌బీఐ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు rbi.org.inని సందర్శించి ఆఫ్‌లైన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హతలు

మొత్తం 13 పోస్టులకు నియామకాల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ లేదా ఎండీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు మాత్రమే నియామకాలకు అర్హులు. అలాగే మీరు జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి ఆర్బీఐ ఇంకా ఎటువంటి వయోపరిమితిని నిర్ణయించలేదు.

జీతం వివరాలు

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ. 1000 వరకు జీతం చెల్లిస్తారు. అంటే మీరు రోజుకు కొన్ని గంటలు పని చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగం అయినప్పటికీ ఇది చాలా గౌరవనీయమైనది, లాభదాయకమైనదిగా చెబుతున్నారు.

ఎంపిక

అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నియామకంలో రాత పరీక్ష ఉండదు. మీ పత్రాలు సరిగ్గా ఉండి మీరు ఇంటర్వ్యూలో సెలక్ట్ అయితే ఎంపికయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి.

దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మీరు ఆఫ్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి. ముందుగా మీరు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in కి వెళ్లండి. అక్కడ రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లి మెడికల్ కన్సల్టెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను తెరిచి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రింట్ తీసుకుని ఫారమ్ నింపిన తర్వాత డిగ్రీ కాపీ, ఫోటో, సంతకం మొదలైన అవసరమైన అన్ని పత్రాలను జత చేసి కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి. జూన్ 6 వరకు అప్లై చేయాలి.

రీజినల్ డైరెక్టర్,

హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్),

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,

ముంబై రీజినల్ ఆఫీస్,

షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై – 400001

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.