దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ పరిధిలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే వెంటనే అప్లయ్‌ చేసుకోండి

www.mannamweb.com


సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC SCR Secunderabad) – దక్షిణ మధ్య రైల్వే (Indian Railway) ఎస్‌సీఆర్‌- స్పోర్ట్స్ కోటాలో 61 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న పురుష, మహిళా క్రీడాకారులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 3 చివరితేదీగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ లేదా నోటిఫికేషన్‌ చూడొచ్చు.

ఇతర ముఖ్యమైన సమాచారం:

ఎస్‌సీఆర్‌ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందెడ్‌.
విద్యార్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్, జిమ్నాస్టిక్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్‌, ఖోఖో తదితర క్రీడల్లో విజయం సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01.01.2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 4, 2025
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025

SCR : సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 4232 అప్రెంటిస్‌ ఖాళీలు
RRC SCR Secunderabad : దక్షిణ మధ్య రైల్వే (South Central Railway)కి చెందిన సికింద్రాబాద్‌ (Secunderabad) రైల్వే జోన్‌లో 4,232 ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ (apprenticeship) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ ఈ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 4232 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 2025 జనవరి 27వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.