కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ Postal Payment Bank (IPPB) దేశవ్యాప్తంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోనూ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఈ సంవత్సరానికి సంబంధించి పలు టాప్ లెవల్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూకే ఉద్యోగం వస్తుంది. ఎంపికైన వారికి రూ.3.16 లక్షల నుండి రూ.4.36 లక్షల వరకు నెల జీతం అందుకోనున్నారు. అభ్యర్థులు 22 ఆగస్ట్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాలు
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)
చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (CCO)
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO)
చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ (CHRO)
అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు:
– అభ్యర్థులు కనీసం డిగ్రీ లేదా/ పీజీ డిప్లొమా / పీజీ డిగ్రీ చేసిన వారు అర్హులు
– గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా AICTE/ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉన్న సంస్థ నుండి ఫుల్ టైమ్ కోర్సు పూర్తి చేసిన వారై ఉండాలి.
1 జులై 2025 నాటికి అభ్యర్థులు 38 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
– పేమెంట్ ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి
– జనరల్, OBC అభ్యర్థులు అప్లికేషన్ కోసం ₹750/ చెల్లించాలి
– ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (SC, ST, PWD) అభ్యర్థులు ₹150/ చెల్లిస్తే సరి
పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంకా ఏమైనా అవసరమైతే బ్యాంక్ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసే ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఇది ఒకటి.
నెల వేతనం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,16,627/- నుండి రూ.4,36,271/- వరకు పోస్టును బట్టి వేతనం చెల్లించనున్నారు.
దరఖాస్తు వివరాలు:
22 ఆగస్ట్ 2025 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వేరే విధంగా వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఒక్క అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అభ్యర్థి అర్హతల ఆధారంగా ఇంటర్వ్యూకు కాల్ వస్తుంది.
అప్లికేషన్ చివరి తేదీ – ఆగస్టు 22, 2025
అప్లికేషన్ కోసం క్లిక్ చేయండిhttps://ibpsonline.ibps.in/ippbljul25/
జాబ్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి View Pdf
ఐపీపీబీ ప్రస్తుతం ఓపెనింగ్స్ కోసం వెబ్ సైట్ https://www.ippbonline.com/web/ippb/current-openings
ఎలా దరఖాస్తు చేయాలంటే..
– మొదట అధికారిక వెబ్సైట్ https://www.ippbonline.com/కు వెళ్లండి
– హోం పేజీలో Careers ఆప్షన్ మీద క్లిక్ చేయండి
– మీకు కావాల్సిన పోస్టును సెలక్ట్ చేసి, Apply Online క్లిక్ చేయండి
– మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ నింపాలి.
– అప్లికేషన్ ప్రాసెస్లో అడిగే అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, ఫీజు చెల్లించాలి
– అన్ని వివరాలు సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ కాపీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి
































