ఈ ఒక్క స్కానింగ్ చేయించుకుంటే చాలు, ఏ గుండె జబ్బులైనా ఇట్టే తెలుసుకోవచ్చు…అసలేంటి ఈ టెస్ట్

మారుతున్న జీవన శైలి మరియు ఇతర కారణాల వలన ఇటీవల కాలంలో ఎంతో మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో రకాల వైద్య పరీక్షలు చేయించుకుంటారు.


అయితే కేవలం ఒక చిన్న టెస్ట్ ద్వారా ఏ రకమైన గుండె జబ్బులైనా సరే ఈజీగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరోనరీ ఆర్టెరీ కాల్షియం (CAC)స్కాన్ అనే చిన్న టెస్ట్ ద్వారా గుండె జబ్బులును ఈజీగా గుర్తించవచ్చు. చాలా నిర్దిష్ట లక్ష్యంతో చేసే ఒక రకమైన CT స్కాన్ ఇది. దీని ద్వారా గుండె యొక్క ధమనులలో కాల్షియం లెవల్స్‌ను చెక్ చేస్తారు. ఏవైనా కాల్షియం నిక్షేపాలు ఉన్నట్లయితే అవి ఫలకం ఏర్పడటానికి ముందస్తు హెచ్చరిక సంకేతాలు. దీనినే అథెరోస్లెరోసిస్ అని పిలుస్తారు, దీని వలన గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

కాల్షియం స్కోర్
కరోనరీ ఆర్టెరీ కాల్షియం (CAC) స్కానింగ్ ద్వారా “కాల్షియం స్కోర్” లభిస్తుంది, ఇది మీ గుండె ఆరోగ్యం గురించి, ఏవైనా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాలు తెలియజేస్తుంది. ఈ టెస్టులో జీరో స్కోర్ వచ్చినట్లయితే మీకు ఏ రకమై గుండె జబ్బులు వచ్చే ప్రమాదం లేదని తెలుపుతుంది. 1 నుండి 100 మధ్య కాల్షియం స్కోర్ ఉన్నట్లయితే తేలికపాటి ఫలకం ఏర్పడవచ్చని,101-400 అనేది సాధారణ స్థాయి ఫలకం ఏర్పడటాన్ని కూడా సూచిస్తుంది. ఈ రకమైన పేషెంట్లు గుండెకు స్టాటిన్స్ వంటి చికిత్సను వైద్యులు సిఫార్సు చేయవచ్చు. కరోనరీ ఆర్టెరీ కాల్షియం (CAC)స్కాన్ టెస్ట్‌లో స్కోర్ 400కు పైగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం. తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

మీరు ఈ టెస్ట్ చేయించుకోవచ్చా?
అయితే కరోనరీ ఆర్టెరీ కాల్షియం (CAC)స్కాన్ టెస్ట్‌ అందరికీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో వారు మాత్రమే, వైద్యుల సలహామేరకు ఈ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాదు 40 ఏళ్లు దాటిన పురుషులు,50 ఏళ్లు దాటిన మహిళలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి ఈ స్కానింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

కరోనరీ ఆర్టెరీ కాల్షియం (CAC)స్కాన్ టెస్ట్‌ ద్వారా నేరుగా గుండె జబ్బులు ఉన్నాయా? లేదా అనే విషయం తెలియజేయదు. ఇది కేవలం గుండె ధమనులలో కాల్షియం స్థాయిలు ఎంతమేరకు ఉన్నాయనే విషయం మాత్రమే తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ టెస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాకపోవచ్చు. ఈ టెస్టుకు సుమారుగా రూ.5000 నుండి రూ.15000 వరకు ఖర్చవుతుంది.

Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే….పాటించేముందు సంబంధిత వైద్య నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.