ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి 2 ఆకులు తింటే చాలు..! శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది

www.mannamweb.com


తులసి ఆకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, తులసి ఒక అద్భుతమైన ఔషధ మొక్క. తులసి ఆకులను అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలో సహాయపడతాయి. రోజూ తులసి ఆకులను తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే ఔషధ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తింటే మీ శరీరంలో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

వర్షాకాలంలో తులసి ఆకులను తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల దానిలోని పోషకాల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పరగడుపునే తులసి ఆకులను తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. అంతేకాదు, తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటును తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తులసి ఆకులను తినటం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. తులసి ఆకులు పళ్లు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. తులసి ఆకుల రసం లేదా కషాయాన్ని నోటితో పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటి నుంచి వచ్చే వాసన తగ్గిపోతుంది.