రోజుకు మూడు చొప్పున ఈ గింజలు తింటే చాలు.. శరీరంలోని ఆ సమస్యలన్నీ పరార్.

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! డైలీ మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు.


ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం కంటెంట్ ఫుల్లుగా ఉంటుంది. చాలా వరకు ఇది నేలలో, నీటిలో, కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. అన్నిచోట్ల మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.

బ్రెజిల్ నట్స్ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి రోజువారీ సెలీనియం అవసరాలను సులభంగా తీర్చవచ్చు. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతోపాటు, థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతను కాపాడుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఖనిజం శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. మొత్తం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

అయితే బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం సమృద్ధిగా లభించినప్పటికీ అతిగా తినడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్క బ్రెజిల్ నట్‌లో సుమారు 68-91 మైక్రోగ్రాముల సెలీనియం ఉంటుంది. అంటే ఆరోగ్య నిపుణుల ద్వారా సిఫార్సు చేయబడిన మోతాదు (55 micrograms for adults) కంటే కాస్త ఎక్కువే. కాబట్టి రోజుకు 3-4 బ్రెజిల్ నట్స్‌కు మించకుండా తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సముద్ర ఆహారం, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లోనూ ఇది లభిస్తుంది.

బ్రెజిల్ నట్స్ – ముఖ్యమైన ప్రయోజనాలు..

* బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది.

*బ్రెజిల్ నట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

*ఈ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటివి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

*సెలీనియం శరీరంలో DNA నష్టాన్ని తగ్గించి క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

*చర్మం ఆరోగ్యానికి, జుట్టు రాలే సమస్య నివారణకు బ్రెజిల్ నట్స్ తినడంమ మంచిది. ఇందులోని విటమిన్ E, సెలీనియం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

*బ్రెజిల్ నట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజుకు 2 లేదా 3 తినడం సురక్షితం. అంతకు మించి తికూడాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.