కాకర ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం కాలకూట విషంతో సమానం

చేదుగా ఉన్నప్పటికీ కాకరకాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు.


అందుకే దీనిని తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అలాగే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కాకరకాయ విటమిన్ సికి అద్భుతమైన మూలం.

ఒక కప్పు కాకరలో విటమిన్ సి దాదాపు 41.5 గ్రాములు ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది విటమిన్ B9 సహజ రూపం. ఇది కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం. అంతేకాకుండా కాకరకాయలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో పాలకూర కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి కణాలను మంట, ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. కానీ కొంతమంది కాకరకాయ తినడం వల్ల మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. ఇందులోని అధిక పోషకాలు కారణం. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం..

కాకర ఎవరికి మంచిది కాదు?

  • గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కాకరకాయకు దూరంగా ఉండటం మంచిది.
  • జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలతో బాధపడేవారు కాకరకాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇది అటువంటి సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అలాగే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కాకరకాయకు దూరంగా ఉండాలి.
  • శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ కాలం ఉపవాసం ఉన్నవారు, శస్త్రచికిత్సల కారణంగా రక్తం కోల్పోయిన వారు కూడా కాకరకాయ తినకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా తగ్గిస్తుంది. ఫలితంగా తలతిరగడం, మూర్ఛపోవడం వంటి సమస్యలు సంభవించవచ్చు.
  • ఇన్సులిన్, డయాబెటిస్, ఇతర మందులు తీసుకునే వ్యక్తులు కాకరను మితంగా తీసుకోవాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గవచ్చు.
  • కొన్ని మందులు తీసుకునే వారికి కాకరకాయ తినడం వల్ల జీవక్రియ ప్రక్రియ దెబ్బతింటాయి. అందువల్ల ఏవైనా సమస్యలకు మందులు తీసుకునేటప్పుడు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే కాకర తీసుకోవడం మంచిది.
  • మూత్రపిండాలు, కాలేయ సమస్యలతో బాధపడేవారు కాకర అధికంగా తినకూడదు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.