‘అర్జున్ S/o వైజయంతి’ ని చూసి అవాక్కైన సెన్సార్ సభ్యులు..రిపోర్ట్ ఏమిటంటే

నందమూరి హీరోలలో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా, తన అభిరుచి కి తగ్గట్టుగా డిఫరెంట్ జానర్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).


ఈయన ఒక హిట్ సినిమా తీస్తే, రెండు మూడు వరుస ఫ్లాప్ సినిమాలు తీస్తాడు అనే టాక్ ట్రేడ్ లో ఉంటుంది. ఈమధ్య ఆయన కేవలం హీరో గా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. గత ఏడాది తన తమ్ముడితో ‘దేవర'(Devara Movie) చిత్రాన్ని తీసి భారీ లాభాలను అందుకున్నాడు. ఆ ఊపులోనే ఆయన ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే విజయశాంతి(Vijayasanthi) ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్ లోకి రానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్ననే పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేశారు. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 24 నిమిషాలు ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇకపోతే ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి అనే డైరెక్టర్ మన ఇండస్ట్రీ కి కొత్తగా పరిచయం కాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, వశిష్ఠ ఇలా ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి ఆయన అందించాడు. ఈ సినిమాతో ప్రదీప్ పేరు కూడా ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్, విజయ్ శాంతిల మధ్య వచ్చే బావోద్వేగపూరిత సన్నివేశాలు ఇటీవల కాలం లో ఏ సినిమాలో కూడా రాలేదని, అవి అద్భుతంగా కుదిరాయని అంటున్నారు. ఎలాంటి సమస్యని అయినా చట్టపరంగా వెళ్లాలనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి ముందుకు పోతే, కళ్యాణ్ రామ్ మాత్రం అన్యాయం చేసే వాళ్లపై తన స్టైల్ లో యుద్ధం చేస్తూ పోతాడు. ఈ సమయంలో తల్లి కొడుకుల మధ్య సంఘర్షణ ఎదురు అవుతుంది. తన కొడుకు వెళ్లే మార్గం తల్లికి నచ్చదు, దండించాలంటే నువ్వు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వు అనే రకం అన్నమాట. అలా వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అద్భుతంగా పేలాయని, ఆడియన్స్ హృదయాలను తాకే విధంగా డైరెక్టర్ చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని సెన్సార్ సభ్యులు మూవీ టీం ని ప్రశంసించారట. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే.