కన్నప్ప 10 రోజుల వసూళ్లు.. 200 కోట్లు పెడితే వచ్చిందెంత? ఇక సర్దేసినట్టేనా

భారీ అంచనాలతో కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అత్యధిక బడ్జెట్ తో నిర్మించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.


AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో కన్నప్పపై భారీ అంచనాలు నెలకున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని ఆశించారు. కానీ 2వ వారంలో కన్నప్ప వసూళ్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?

హిందూ చరిత్ర, పురణాలను చెబుతున్న సినిమా కన్నప్ప కావడం విశేషం. పైగా ఈ చిత్రంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ నటించారు. మరోవైపు పూర్తిగా న్యూజిలాండ్ లో 7000 ఎకరాల్లో షూటింగ్ ను కంప్లీట్ చేశారు. చిత్రానికి హిందీ మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లోని ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కు పని చేశారు. దీంతో రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కానీ ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు రూ.200 కోట్లకు పైగా ఖర్చైందని చెప్పడం గమనార్హం.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

ఈ చిత్రంలో భారీ తారాగణం ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించడంతో వారికి ఉన్న మార్కెట్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మరోవైపు హిందూ మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో కాస్తా ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసింది. దీంతో ఈ చిత్రానికి రూ. 100 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందనేది అంచనా. కానీ ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే మాత్రం రూ.180 కోట్లు కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

కన్నప్ప 10 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..

ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసింది. ఇక 10వ రోజు రూ.68 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మిగితా వసూళ్లు అన్ని కలుపుకొని వరల్డ్ వైడ్ గా కేవలం 10వ రోజు రూ.1కోటీ వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

200 కోట్లు పెడితే తిరిగి వచ్చిందింతే?

కన్నప్ప చిత్రానికి మేకర్స్ తెలిపిన బడ్జెట్ ప్రకారం రూ.200 కోట్లు వెచ్చించారు. అయితే ఇందులో నాన్ థియేట్రికల్ రైట్ ద్వారా, అది కూడా హిందీ శాటిలైట్ రైట్స్ ను అమ్మడంతో రూ.20 కోట్లు తిరిగి వచ్చింది. ఇక మిగిలి భాషల్లోని రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. మరోవైపు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడు కాలేదు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద 10 రోజుల్లో మొత్తంగా రూ.43 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇస్తోంది. ఇక ఇండియా నెట్ రూ.31.93 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.36.65 కోట్లు, ఓవర్సీస్ రూ.5.1 కోట్లు కలెక్ట్ అయ్యిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ఈ చిత్రానికి ఇంకా రూ.155 కోట్ల వరకు తిరిగి రావాల్సి ఉంది. కేవలం 24 శాతం వరకే రికవరీ చేసిందని తెలుపుతున్నారు. మరోవైపు 2వ వారంలో కేవలం 50 లక్షల రూపాయలకు మించి మాత్రమే వసూళ్లు రాబడుతుండటంతో సెకండ్ వీక్ ఎండింగ్ లోపు థియేట్రికల్ రన్ డీలా పడుతుందా? అని సందేహిస్తున్నారు. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.