ఇటీవల ఓ ఈవెంట్‌లో హీరో కంపెనీ ఎక్స్ పల్స్ 2014, కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250ను కూడా రిలీజ్ చేసింది. ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.
ముఖ్యంగా స్పోర్టీ లుక్ యువతన అమితంగా ఆకర్షిస్తుంది. అధునాతన ఫ్యూయల్ ట్యాంక్, సిట్-సీట్ సెటప్ బైక్‌కు నయా లుక్‌ను ఇస్తుంది. తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వచ్చే ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం కౌల్ నలుపు టోన్‌తో ఆకర్షిస్తుంది. ఎగ్జాస్ట్ సిల్వర్ ట్రిమ్‌తో వచ్చే కరిజ్మా ఎక్స్ఎంఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు బైక్‌కు నయా లుక్‌ను ఇస్తాయి.
కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 డీఓహెచ్‌సీ 250 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 30 హెచ్‌పీ, 25 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ ఇంజిన్‌లో 250 సీసీ మిల్లో స్ట్రోక్ పొడవును 7 ఎంఎం పెంచారు. ఇది ఆరు-స్పీడ్ గేర్బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 కోసం స్టీల్-ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్ సెటప్‌తో వస్తుంది.
కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 2025 వెర్షన్‌లో ముందు, వెనుక 17 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. అలాగే ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. హీరో ఈ 30 హెచ్‌పీ స్పోర్ట్స్ బైక్‌కు అడ్జస్టబుల్ క్లిప్-ఆన్ హ్యాండిలార్బర్లను కూడా ఇస్తుంది. అయితే ఈ ఈవెంట్‌లో భారతదేశంలో కొత్త కరిజ్మా ఎక్స్ టెన్ఆర్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో? హీరో ధృవీకరించలేదు. ముఖ్యంగా సుజుకీ జిక్స్ ఎస్ఎఫ్-250కు పోటీనిచ్చేలా హీరో కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 ధరను రూ. 2 లక్షలకే అందుబాటులో ఉంచింది.