కడుపు మాడుస్తున్నారు సార్‌.. ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని

తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది.


తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది. మంగళవారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు పల్నాడు జిల్లా బొల్లాపల్లి కస్తూర్బా పాఠశాలకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఎంఈఓ పార్వతి విద్యార్థినులకు సూచించారు.

ఓ బాలిక వేదిక పైకి వచ్చి కూరలు నాసిరకంగా పెడుతున్నారని, తాగునీటి సమస్య ఉందని కన్నీటి పర్యంతమైంది. వెంటనే ఎమ్మెల్యే వంట సిబ్బందిని ప్రశ్నించగా నాసిరకం సరకులు ఇస్తున్నారని చెప్పారు. సరకులు సరఫరా చేసే గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యాశాఖాధికారులను ఆదేశించారు.