కుప్పకూలిన విమానం: 72 మంది దుర్మరణం?

www.mannamweb.com


Kazakhstan plane crash: కజకిస్తాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ పౌర విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

కజకిస్తాన్‌లోని అక్టావ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదానికి గురైన ఈ విమానం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన సంస్థకు చెందినది. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని ఛెఛెన్యాలోని గ్రోజ్నీకి బయలుదేరిన విమానం అది. ఆ సమయంలో విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు.

దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దీన్ని దారి మళ్లించారు. కజికిస్తాన్‌లోని అక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్గటన సంభవించింది. అక్టావ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది.

చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తరువాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించిందా ఫ్లైట్. సాధ్యపడలేదు. క్రాష్ ల్యాండింగ్‌కు గురైంది. కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలింది. భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది తెలియరావట్లేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానంలో ఉన్న 72 మందీ మరణించి ఉండొచ్చంటూ ప్రాథమిక అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.